Home > తెలంగాణ > హైదరాబాద్‌లో 15 చోట్ల ఈడీ దాడులు.. మాలినేని కంపెనీల్లో

హైదరాబాద్‌లో 15 చోట్ల ఈడీ దాడులు.. మాలినేని కంపెనీల్లో

హైదరాబాద్‌లో 15 చోట్ల ఈడీ దాడులు.. మాలినేని కంపెనీల్లో
X

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేస్తోంది. మంగళవారం తెల్లవారుజూము నుంచి ఆయన నివాసంతోపాటు పలు కార్యాయాల్లో, దగ్గరి బంధవుల ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్ట ప్రాంతాల్లో ఉన్న సాంబశివరావు ఇళ్లు, ఆఫీసులను తమ అధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నారు. ఫోన్లు తీసుకుని లోపలున్న వ్యక్తులను బయటికి కదలనీయకుండా కూపీ లాగుతున్నారు. మొత్తం 15 బృందాలతో దాడులు చేస్తున్నారు. సాంబశివరాలు మానీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఆయన ట్రాన్స్ పవర్, టెక్నో ఇన్ఫ్రాటెక్, కాకతీయ క్రిస్టల్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రాయ్ రోడ్డు ప్రాజెక్ట్ కంపెనీలను నడుపుతున్నారు. ట్రాన్స్ టాయ్ కంపెనీతోపాటు పలు కంపెనీల పేర్లతో బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 1 Aug 2023 2:03 PM IST
Tags:    
Next Story
Share it
Top