ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు
X
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో తనీఖీలు చేస్తొంది. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారులపై అధికారులు ఆరా తీస్తున్నారు.ఆమె ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి దాడులు జరుగుతున్నాయని తెలుస్తొంది.సోదాల నేపధ్యంలో కవిత ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరో మూడు, నాలుగు గంటల పాటు సోదాలు జరిగే అవకాశం ఉంది.
కవిత ఇంట్లోకి ఎవరినీ ఈడీ అధికారులు అనుమతించడం లేదు. కవిత ఇంట్లో ఈడీ అధికారుల సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దాడులు జరుగుతుండటంతో బీఆర్ఎస్ కేడర్ భయాందోళనలకు గురవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉందనే అనుమానంతో హైదరాబాద్‌లో పలు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మరోసారి కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైడ్స్ జరగడం చర్చానీయాంశంగా మారింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.