ప్రభుత్వ నిర్ణయం.. విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు!
X
రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలతో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం వానలు కాస్త తగ్గు ముఖం పట్టగా.. ఇప్పటికీ కొన్ని గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ క్రమంలో మరింత మెరుగైన సేవలు అందిచేందుకు ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధం చేస్తోంది. కాగా, అవాంచీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న విద్యా శాఖ.. స్కూళ్లు, కాలేజీలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ఊళ్లు, అందులోని స్కూళ్లు పూర్తిగా నీట మునిగాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్కూళ్లకు వరద రాగా, 3వేల స్కూళ్లలో బురద పేరుకుపోయింది. 6వేల స్కూళ్లలోని ఎలక్ట్రిక్ బోర్డుల్లీ నీరు చేరి.. విద్యుత్ వ్యవస్త పాడైపోయింది. అంతేకాకుండా స్కూళ్ల పరిసరాలు ఏ విధంగా ఉన్నోయే తెలియని పరిస్తితి ఉంది. దోమల వల్ల విద్యార్థులకు మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. 0స్కూళ్లను పునరుద్ధరించాలన్నా.. వరుసగా రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం కూడా విద్యాసంస్థలు పనిచేయడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. దీంతో సోమవారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది.