Home > తెలంగాణ > రాష్ట్రంలో మరో 20 కేజీబీవీలు.. జీవో జారీ చేసిన విద్యాశాఖ

రాష్ట్రంలో మరో 20 కేజీబీవీలు.. జీవో జారీ చేసిన విద్యాశాఖ

రాష్ట్రంలో మరో 20 కేజీబీవీలు.. జీవో జారీ చేసిన విద్యాశాఖ
X

రాష్ట్రంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు సంఖ్య మరింత పెరగనుంది. కొత్తగా మరో 20 కేజీబీవీలు మంజూరయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం జీవో నెంబర్‌ - 24ను విడుదల చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి రికరింగ్ బడ్జెట్ గా రూ. 60 లక్షలను మంజూరుచేసింది. జిల్లాల విభజనతో అనంతరం చాలా వరకు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. వాటిలో కేజీబీవీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో 20 కేజీబీవీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆ ప్రతిపాదనలకు తాజాగా ఆమోదం లభించడంతో కొత్తగా 20 కేజీబీవీల ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి.





రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో కేవలం 391 కేజీబీవీలు మాత్రమే ఉండేవి. 2017-18లో కేసీఆర్ సర్కారు కొత్తగా 84 కేజీబీవీలను మంజూరుచేసింది. తాజాగా మరో 20 కేజీబీవీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వాటి సంఖ్య 495కు చేరింది. వీటిలో 245 కేజీబీవీల్లో ఇంటర్‌, మరో 230 కేజీబీవీల్లో టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయి.

కొత్తగా ఏర్పాటయ్యే కేజీబీవీలు ఇవే

మావల (ఆదిలాబాద్‌)

బీర్‌పూర్‌, బుగ్గారం (జగిత్యాల)

కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్‌)

దంతాలపల్లి (మహబూబాబాద్‌)

మహ్మదాబాద్‌ (మహబూబ్‌నగర్‌)

నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్‌ (మెదక్‌)

నిజామాబాద్‌ (సౌత్‌)

నిజామాబాద్‌ (నార్త్‌)

నాగలిగిద్ద (సంగారెడ్డి)

మెగ్గుంపల్లి (సంగారెడ్డి)

వట్‌పల్లి (సంగారెడ్డి)

గుమ్మడిదల (సంగారెడ్డి)

చౌటకూరు (సంగారెడ్డి)

దూల్మిట్ట (సిద్దిపేట)

చౌడాపూర్‌ (వికారాబాద్‌)




Updated : 29 Aug 2023 4:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top