Egg Price In Telangana : పెరిగిన కోడిగుడ్డు ధర.. ఎంతంటే?
X
కోడిగుడ్డు ధర పెరిగింది. గత నెల ప్రారంభంలో రూ.5.50 ఉన్న గుడ్డు ధర.. చివరి వారంలో రూ.6కు చేరుకుంది. తాజాగా ఆ ధర రూ.7కి చేరింది. హోల్‌సేల్‌లో మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76గా ఉంది. ఇక డజను గుడ్ల ధర రూ.72 నుంచి రూ.84 వరకు పెరిగింది. గుడ్డుతో పాటుగా చికెన్ ధరలు కూడా పెరిగాయి. నవంబర్‌లో కిలో చికెన్ రూ.170 నుండి రూ.190 మధ్యలో ఉండగా.. ప్రస్తుతం ఆ ధర రూ.240కి చేరింది. తెలంగాణలో 1,100 కోళ్ల ఫారాలు ఉండగా గుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం 3 స్థానంలో ఉంది. ధర పెరగడానికి కారణం చలి ప్రభావమే కారణం అంటున్నారు వ్యాపారులు. వారం, పది రోజుల నుండి చలి ప్రభావం విపరీతంగా పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడి, గుడ్ల ఉత్పత్తి తీవ్రంగా పడిపోయిందని అంటున్నారు. దీంతో పాటుగా దాణా ఛార్జీలు పెరుగుదల కూడా గుడ్డు ధర పెరుగుదలకు కారణమైంది. క్వింటాలు సోయా చెక్క క్వింటాలు దాణా ధర గతేడాది ప్రారంభంలో రూ.5 వేలు ఉండగా.. ప్రస్తుతం అది ధర రూ.7,200కు చేరుకుంది. అలాగే మొక్కజొన్న క్వింటాలుకు ధర రూ.1,800 నుంచి రూ.2 వేలకు పెరిగింది. ఇక రవాణా ఖర్చుల పెరుగుదల కూడా కోడి ధర కొండెక్కేలా చేసింది.
సాధారణంగా హైదరాబాద్‌లో రోజులో 80 లక్షల కోడిగుడ్డు ఆమ్ముడు అవుతుండంగా వారం రోజుల క్రితం అది కోటి దాటింది. కార్తీక మాసం ముగియడం, పండుగల సీజన్ ప్రారంభం అవడంతో కోడి గుడ్ల విక్రయాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు, దీంతో డిమాండ్ పెరగడంతో ధర కూడా