Breaking News: బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం
X
బీఆర్ఎస్ నేత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారు కొందరు గుర్తు తెలియని దుండగులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని దౌల్తాబాద్ మండలం సూరంపల్లి పర్యటిస్తున్న ఆయన్ను.. గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రభాకర్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న కార్యకర్తలు, స్థానికులు ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు చెప్పాలా గ్రామానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం గజ్వేల్ ఆసుపత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో రాజు అనే వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడికి దిగారు. కడుపు భాగంలో గాయం కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన రాజు అనే వ్యక్తి ఎవరు? ఎందుకు దాడి చేశారు? అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గజ్వేల్ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం ఆయనను హైదరాబాద్ తరలించాలని నిర్ణయించారు.