Breaking News : హైదరాబాద్ కొత్త సీపీగా సందీప్ శాండిల్యా
X
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యా నియమాకం అయ్యారు. ఈసీ సిఫార్సుతో ఆయన్ని కొత్త సీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాండిల్యా 1993 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో ఆయన సైబరాబాద్ సీపీగా పనిచేశారు. ఈ క్రమంలో సీనియారిటీ ప్రకారం ఈసీ ఆయనవైపే మొగ్గు చూపింది. రేపు నూతన సీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
అంతకుముందు తెలంగాణలో ఇటీవల బదిలీ చేసిన స్థానాల్లో నూతన ఎస్పీలు, కమిషనర్లను ఈసీ నియమించింది. ఈసీ సిఫార్సుతో ప్రభుత్వం వారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
10 జిల్లాలకు ఎస్పీలు, నిజామాబాద్, వరంగల్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్ల లిస్ట్ విడుదల చేసింది.
వరంగల్ సీపీగా అంబరీ కిషోర్ ఝా
సంగారెడ్డి సీపీగా చెన్నూరి రూపేష్
నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్
నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్
సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే
కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ
జగిత్యాల ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్
నారాయణపేట్ ఎస్పీగా యోగేష్ గౌతమ్
జోగులాంబ గద్వాల ఎస్పీగా రితిరాజ్
జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా కారె కిరణ్ ప్రభాకర్
మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్ సింగ్ గణ్పత్ రావ్
మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్దన్ లను నియమించింది.