Home > తెలంగాణ > బీఆర్ఎస్ పై సీరియస్.. ఈసీ నోటీసులు

బీఆర్ఎస్ పై సీరియస్.. ఈసీ నోటీసులు

బీఆర్ఎస్ పై సీరియస్.. ఈసీ నోటీసులు
X

బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. స్కాంగ్రెస్ పేరిట ఇచ్చిన ప్రకటనల విషయమై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని సీఈవో వికాస్ రాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైనప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయా పార్టీలపై వ్యతిరేకంగా వీడియోలు, పోస్టర్లు, యాడ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీని స్కాంగ్రెస్ గా విమర్శించింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఈసీకి నోటీసులు ఇచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ తమ పార్టీపై ఇస్తున్న యాడ్స్ పై కంప్లైంట్ ఇచ్చి బ్యాన్ చేయించింది.

Updated : 28 Nov 2023 7:36 AM IST
Tags:    
Next Story
Share it
Top