Home > తెలంగాణ > ఎమ్మెల్యేగా డీకే అరుణ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

ఎమ్మెల్యేగా డీకే అరుణ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

ఎమ్మెల్యేగా డీకే అరుణ.. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు
X

గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 2018 ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని ధర్మాసనం ఆయనపై అనర్హత వేటు వేసింది. అదే సమయంలో బీజేపీ నేత డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్ట్ తీరుపై కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా స్పందించింది. ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా తక్షణమే హైకోర్ట్ ఆదేశాలు అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసింది.

2018 ఎన్నికల ఫలితాల అనంతరం.. కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ డీకే అరుణ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై హైకోర్టు తీర్పు వెలువరించింది. కృష్ణ మోహన్‌ ఎన్నికల చెల్లదని ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.50 లక్షల జరిమానా విధిస్తూ.. పిటిషనర్‌ ఖర్చుల కింద డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. 2018 డిసెంబరు నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది.ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న డీకే అరుణ.. ఈ తీర్పు సంతోషాన్ని కలిగించిందన్నారు. తీర్పు వెలువడ్డాక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వాస్తవాలను దాచారు. హైకోర్టు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, తుది తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ తీర్పు ఆలస్యమైంది. రెండుమూడేళ్ల ముందే తీర్పు రావాల్సింది. ఆలస్యమైనా న్యాయం జరిగింది’’ అని ఆన్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కృష్ణ మోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన న్యాయస్థానం.. 2018 డిసెంబరు నుంచి డీకే అరుణనే ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పింది.

Updated : 4 Sept 2023 6:00 PM IST
Tags:    
Next Story
Share it
Top