Election Commission Orders: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లపై ఈసీ బదిలీ వేటు
X
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది. నలుగురు కలెక్టర్లతో పాటు ఐదుగురు కమిషనర్లు, 8 మంది ఎస్పీలను ట్రాన్స్ ఫర్ చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి , యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లా కలెక్టర్లకు వెంటనే బదిలీ ఉత్తర్వులు అందజేయాలని ఆదేశించింది. ఇక హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ కమిషనర్ రంగనాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం కమిషనర్ విష్ణు వారియర్ను ట్రాన్స్ఫర్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస రాజు, ఎక్సైజ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ, కమర్షియల్ టాక్స్ కమిషనర్ టీకే శ్రీదేవిలను బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశించింది. గురువారం సాయంత్రం 5 గంటల కల్లా కొత్త ప్యానెల్ పంపాలని ఈసీ స్పష్టం చేసింది.