ఈసీ సీరియస్.. ముగ్గురు పోలీసు అధికారులపై వేటు..
X
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గంటల ముందు ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ.. తాజాగా ముగ్గురు పోలీసు అధికారులపై వేటు వేసింది. విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ వారిని సస్పెండ్ చేసింది. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఏసీపీ జహంగీర్‌లను ఈసీ విధుల నుంచి తప్పించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పార్టీల డబ్బుల పంపిణీని అడ్డుకోవడంలో ముగ్గురు పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఈ క్రమంలో ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ స్టార్ట్ కానున్న సమయంలో ముగ్గురు అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఎన్నికల సంఘం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించింది.