Home > తెలంగాణ > పోలింగ్ క్యూలో ఎంతమంది ఉన్నారో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు

పోలింగ్ క్యూలో ఎంతమంది ఉన్నారో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు

పోలింగ్ క్యూలో ఎంతమంది ఉన్నారో ఇంటి నుంచే తెలుసుకోవచ్చు
X

చాలామంది ఓటు వేయకపోవడానికి కారణాల్లో ఒకటి చేంతాడంత పోలింగ్ క్యూలు. పోలింగ్ బూత్‌లో వందల సంఖ్యలో లేకపోతే పదుల సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఉంటారని, గంటల తరబడి నిల్చోవాల్సి ఉంటుందని ఇంటికే పరిమితమవుతుంటారు. పోలింగ్ బూత్‌లలో క్యూలో తక్కువ మంది ఉన్నారని తెలిస్తే ఓటేసి రావొచ్చనుకుంటారు. క్యూలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలంటే పోలింగ్ స్టేషన్‌కు వెళ్లక తప్పదు. ఆ కష్టం కూడా లేకుండా ఎన్నికల సంఘం కొత్త సదుపాయం కల్పించింది. క్యూలైన్‌లో ఎంతమంది ఉన్నారో ఇంటి నుంచే తెలుసుకోవడానికి ఆన్ లైన్ సదుపాయం తీసుకొచ్చింది. హైదరాబాద్‌ ఓటర్లు https://ghmcbls.in/poll-queue-status వైబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ వివరాలు తెలుసుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు

క్యూలో ఎంతమంది ఉన్నారో, ఓటింగ్‌కు ఎంత సమయం పడుతుందో ఈ సైట్ ద్వారా తెలుకోవచ్చు. దాన్ని బట్టి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ప్లాన్ చేసుకోవచ్చ. ఈ సైట్లో తమ నియోజకవర్గాన్ని, పోలింగ్ స్టేషన్‌ను ఎంచుకుని పోల్ క్యూ రూట్ PollQRoute ఆప్షన్ ద్వారా కూడా ఈ వివరాలు తెలుసోవచ్చు.

Updated : 30 Nov 2023 8:21 AM IST
Tags:    
Next Story
Share it
Top