TS Election : తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల
Kiran | 4 Oct 2023 5:54 PM IST
X
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వారిలో 1,58,71,493 మంది పురుష ఓటర్లు ఉండగా, 1,58,43,339 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,557 మంది ఓటర్లు ట్రాన్స్ జెండర్లుగా నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్ 28 నాటికి రాష్ట్రంలో 17,01, 087 మంది కొత్తగా ఓటర్లుగా చేరారు. వివిధ కారణాలతో 6.10,694 ఓట్లను అధికారులు తొలగించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. రెండో రోజు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో ఈసీ సభ్యులు భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేస్తుంది.
Updated : 4 Oct 2023 5:54 PM IST
Tags: telangana ts election telangana assembly election voter list male voters female voters transgenders september 28 new voters central election commission CEC
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire