హైదరాబాద్ ఓటర్ల లెక్క తేలింది.. కొత్త ఓటర్లు ఎంతమందంటే..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా శరవేగంతో రూపొందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల తుది జాబితాను శుక్రవారం విడుదల చేసింది. జీహెచ్ఎంసీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 23.22 లక్షల మంది పురుషులు, 22.13 స్త్రీలు, 327 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. కొత్త ఓటర్ల సంఖ్య 77,522. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల 80 వేల మంది ఉన్నారు. కాగా తెలంగాణలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 ఓట్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం నెల కిందట తుది జాబితా వెలువరించింది,. ప్రక్షాళనలో భాగంగా 22 లక్షల 2168 ఓట్లను తొలగించింది. రాష్ట్రంలో మహిళా ఓటర్లు కోటీ 58 లక్షల 43 వేల 339, పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 , ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మందిగా ఉన్నారు.
జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా..
పురుష ఓటర్లు 23,22,623హైదరాబాద్ ఓటర్ల లెక్క తేలింది.. కొత్త ఓటర్లు ఎంతమందంటే..
మహిళా ఓటర్లు 22,13,902
దివ్యాంగ ఓటర్లు 20,207
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 883
సర్వీస్ ఓటర్లు 404
ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 327