Home > తెలంగాణ > Telangana Assembly Elections 2023: ఈసీ కీలక నిర్ణయం.. ఆ 13 స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్

Telangana Assembly Elections 2023: ఈసీ కీలక నిర్ణయం.. ఆ 13 స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్

Telangana Assembly Elections 2023: ఈసీ కీలక నిర్ణయం.. ఆ 13 స్థానాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్ట్ ప్రభావిత నియోజకవర్గాల్లో గంట ముందు పోలింగ్ ముగించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మొత్తం 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గాలు మినహా మిగిలిన 102 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సిర్పూర్, బెల్లపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినసాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ముందుగా పోలింగ్ ముగియనుంది. రానున్న ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర అధికారులకు ఈసీ పలు సూచనలు చేసింది.

Updated : 30 Oct 2023 8:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top