Home > తెలంగాణ > ఆసిఫాబాద్లో ఆసక్తి రేపుతున్న అక్కాచెల్లెళ్ల పోరు

ఆసిఫాబాద్లో ఆసక్తి రేపుతున్న అక్కాచెల్లెళ్ల పోరు

ఆసిఫాబాద్లో ఆసక్తి రేపుతున్న అక్కాచెల్లెళ్ల పోరు
X

ఎన్నికల్లో చుట్టాలే కాదు తొబుట్టువులూ పోటీపడడం కొత్తేం కాదు. ఇంతకుముందు చాలా సాక్లు అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు ప్రత్యర్థులుగా పోటీపడిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని ఓ నియోజకవర్గంలో అక్కాచెల్లెళ్ల పోటీ పడే అవకాశం మెండుగా ఉంది. ఒకరు బీఆర్ఎస్, మరొకరు కాంగ్రెస్ తరుపున ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఇది కన్ఫార్మ్ అయితే నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది.

కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడు. ఈ స్థానానికి బీఆర్ఎస్ జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మీని అభ్యర్థిగా ప్రకటించింది. ఆమె 2014లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె జడ్పీ చైర్ పర్సన్గా ఉన్నారు. అయితే సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. కోవా లక్ష్మీకి ధీటైనా అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తోంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. కోవా లక్ష్మిపై ఆమె సొంత చెల్లెలిని బరిలో దించే ఆలోచనలో ఉంది. ఆసిఫాబాద్‌ సర్పంచ్‌గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే సరస్వతి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అటు క్యాడర్ కూడా ఆమె అయితేనే బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వొచ్చని అంటున్నారు. దీంతో హస్తం పార్టీ సరస్వతీ వైపే మొగ్గు చూపుతోంది.

కోవా లక్ష్మి, మర్సకోల సరస్వతి మాజీ మంత్రి కోట్నాక భీమ్‌రావు బిడ్డలు. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కారు పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం, ప్రస్తుతం జడ్పీ చైర్ పర్సన్ గా ఉండడంతో కోవా లక్ష్మీపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని క్యాష్ చేసుకుని ఎన్నికల్లో గెలవాలని సరస్వతి భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలో గెలుపు ఎవరినీ వరిస్తుందో వేచి చూడాలి.

Updated : 26 Aug 2023 10:13 PM IST
Tags:    
Next Story
Share it
Top