Home > తెలంగాణ > ఎన్నికల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము ఎంతంటే..

ఎన్నికల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము ఎంతంటే..

ఎన్నికల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము ఎంతంటే..
X

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదు, మద్యం పట్టుబడింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు రూ.745 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం, ఇతర వస్తువులను ఎన్నికల అధికారులు జప్తు చేశారు. గత 24 గంటల్లోనే రూ.8.07 కోట్లు పట్టుబడ్డాయి. అక్టోబర్ 9న ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగా.. నవంబర్ 29 ఉదయం 9 గంటల వరకు రూ.305,72,46,540 కోట్ల నగదు సీజ్ చేశారు. ఇక అక్రమంగా సరఫరా చేస్తున్న 2,63,482 లీటర్ల మద్యం, 53,065 కేజీల నల్ల బెల్లం, 3464 కిలోల అల్లం, 113.5 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.127,55,06,859 కోట్లు. ఈ 50 రోజుల్లో అధికారులు రూ.40,14,80,034 కోట్ల మత్తు పదార్థాలు సీజ్ చేశారు.

ఇక బంగారం, వెండి, వాటితో చేసిన ఆభరణాలు, వస్తువులను సైతం భారీగా పట్టుకున్నారు. అధికారులు 50 రోజుల్లో రూ. 187,00,43,376 కోట్ల విలువైన 303.553 కిలోల బంగారం, 1195 కిలోల వెండి, 19297.644 క్యారెట్ల వజ్రాలు, 5.35 గ్రాముల ప్లాటినం దొరికింది. వీటితో పాటు రూ. 84,94,29,676కోట్ల విలువైన వాహనాలు, బియ్యం, కుక్కర్లు, కుట్టు మిషన్లు, గోడ గడియారాలను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు.




Updated : 29 Nov 2023 4:10 PM GMT
Tags:    
Next Story
Share it
Top