Home > తెలంగాణ > Election Results 2023: ఈ 4 రాష్ట్రాల్లో నేడే ఓట్ల లెక్కింపు

Election Results 2023: ఈ 4 రాష్ట్రాల్లో నేడే ఓట్ల లెక్కింపు

Election Results 2023: ఈ 4 రాష్ట్రాల్లో నేడే ఓట్ల లెక్కింపు
X

తెలంగాణతో పాటు నేడు మరో 4 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగునుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు సాగింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గత మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్, అదే ఊపులో తాజా ఎన్నికల్లో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తానని ఆశాభావంతో ఉంది. ఈసారి రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లు తమ వశమవుతాయని బీజేపీ భావిస్తోంది. ఈసారి మధ్యప్రదేశ్‌లో బీజేపీకి బాగా మొగ్గుందని, రాజస్తాన్‌లో ఆ పార్టీ ముందంజలో ఉందని గురువారం వెలువడ్డ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు పేర్కొన్నాయి. ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నట్టు తేల్చాయి. హోరాహోరీ పోటీ నేపథ్యంలో హంగ్‌ వచ్చే చోట ఎమ్మెల్యేలను శిబిరాలకు తరలించేందుకు రెండు పారీ్టలూ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.

తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 ఉండగా.. అధికారం చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 60కి చేరాల్సి ఉంటుంది. ఇక మధ్యప్రదేశ్ లో 230 స్థానాలు ఉండగా అధికారం చేజిక్కించుకోవాలంటే 116 స్థానాలు గెలవాల్సి ఉంది. రాజస్థాన్ లో 199 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 100, ఛత్తీస్ గఢ్ 90 స్థానాలు ఉండగా అధికారం చేజిక్కించుకోవాలంటే 46 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. వీటిని కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Updated : 3 Dec 2023 7:31 AM IST
Tags:    
Next Story
Share it
Top