Assembly Elections 2023: నవంబర్ 12 నుంచి ఎన్నికలు.. తెలంగాణలో మాత్రం..!
X
తెలంగాణలో ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది తెలంగాణతో సహా.. రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. కాగా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగొచ్చని తెలుస్తుంది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మిజోరంలో అసెంబ్లీ గడువు డిసెంబర్ 17తో ముగుస్తుండగా.. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం 2024 జనవరిలో గడువు ముగుస్తుంది.
ఓట్ల లెక్కిపు డిసెంబర్ 10 నుంచి 15 మధ్య జరగనుందని తెలుస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో పర్యటించింది. ఇటీవలే మూడు రోజులతో పాటు తెలంగాణలో పర్యటించింది. ఈ క్రమంలో పలు పార్టీలు, అధికారులతో భేటీ అయి.. ఎన్నిక నిర్వహణపై చర్చించింది. ఇవాళ ఐదు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరితో చర్చించి.. ఏ క్షణమైనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.