వారి సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం.. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం
X
రాష్ట్ర వ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలతో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలు జల దిగ్భందంలో ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ క్రమంలో మరింత మెరుగైన సేవలు అందిచేందుకు ప్రభుత్వ ఉద్యోగులను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పోలీస్, వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేయగా.. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు ఉద్యోగులకు తెలియజేశారు. ఉద్యోగులు ఇవాళ (జులై 29), రేపు (జులై 30) విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వరద ముప్పు ఉన్న కారణంగా అధికారులు, ఉద్యోగులు, ఆర్జిజన్లు తప్పనిసరిగా విధుల్లో చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ ఆదేశాలను విస్మరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.