Home > తెలంగాణ > సాగర్ వద్ద పూర్వస్థితిని తీసుకురండి: కేఆర్ఎంబీని కోరిన ఈఎన్సీ

సాగర్ వద్ద పూర్వస్థితిని తీసుకురండి: కేఆర్ఎంబీని కోరిన ఈఎన్సీ

సాగర్ వద్ద పూర్వస్థితిని తీసుకురండి: కేఆర్ఎంబీని కోరిన ఈఎన్సీ
X

నాగార్జున సాగర్పై ఆధిపత్యం కోసం ఏపీ ప్రభుత్వం కాలుదువ్వుతున్న విషయం తెలిసిందే. దీంతో గత కొన్నిరోజులుగా సాగర్ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. డ్యామ్‌ 13వ గేట్‌ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు నీటిని విడుదల కొనసాగించారు. ఏపీ పోలీసులపై తెలంగాణ ఎస్పీఎఫ్ నాగార్జునసాగర్ పీఎస్లో కంప్లైంట్ చేశారు. అర్థరాత్రి సమయంలో అనుమతిలేకుండా డ్యాంపైకి రావడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని అందులో రాశారు. ఫిర్యాదు ఆధారంగా నాగార్జునసాగర్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఏపీ పోలీసులతో పాటు ఇరిగేషన్ అధికారులను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో ఉంది. ధర్మాసనం దీనిపై తీర్పును జనవరికి వాయిదా వేసింది.

కాగా సాగర్ వద్ద పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఏపీని కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్ ను తెలంగాణ ప్రభుత్వమే నియంత్రించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ పేర్కొన్నారు. దానికి అనుగుణంగా నవంబర్ 28 కంటే ముందున్న పరిస్థితిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరారు. సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా స్పందించాలని కేఆర్ఎంబీని కోరారు.

Updated : 4 Dec 2023 9:37 PM IST
Tags:    
Next Story
Share it
Top