Home > తెలంగాణ > కేటీఆర్ ను కలిసిన ఏపూరి.. త్వరలో బీఆర్ఎస్లో చేరిక..?

కేటీఆర్ ను కలిసిన ఏపూరి.. త్వరలో బీఆర్ఎస్లో చేరిక..?

కేటీఆర్ ను కలిసిన ఏపూరి.. త్వరలో బీఆర్ఎస్లో చేరిక..?
X

ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. ఇటీవలే వైఎస్ షర్మిల పార్టీకి రాజీనామా చేసిన సోమన్న శుక్రవారం రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలోనే తన నిర్ణయాన్ని కేటీఆర్‌తో సోమన్న చెప్పగా.. కేటీఆర్ సైతం వెంటనే స్వాగతించినట్లు సమాచారం. ఒకవేళ ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరితే సాయిచంద్ లేని లోటును భర్తీ చేస్తారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం వెలిశాల గ్రామానికి చెందిన ఏపూరి సోమన్న తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కళాకారుల విభాగంలో ఉద్యోగం కల్పించింది. అయితే ఆ ఉద్యోగం వదిలేసిన ఆయన.. కాంగ్రెస్ గూటికి చేరారు. అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సాఆర్టీపీ కండువా కప్పుకున్నారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా షర్మిల ఏపూరికి తుంగతుర్తి టికెట్‌ను ఖరారు చేశారు. అయితే షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం కానుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఏపూరి సోమన్న బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Updated : 22 Sept 2023 6:08 PM IST
Tags:    
Next Story
Share it
Top