Home > తెలంగాణ > కీలక నేతల కన్ను బీజేపీ వైపు.. పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు: ఈటల

కీలక నేతల కన్ను బీజేపీ వైపు.. పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు: ఈటల

కీలక నేతల కన్ను బీజేపీ వైపు.. పార్టీలో చేరడానికి క్యూ కడుతున్నారు: ఈటల
X

thumb: పార్టీలో 22 మంది చేరతామంటున్నరు

రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. బీజేపీ పార్టీలోకి చేరేందుకు రాష్ట్రంలోని పలువురు మఖ్య నేతలు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త జోరుగా ప్రచారం అవుతోంది. అయితే, వీటిని అన్నడి ఎవరో కాదు.. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందరే. ‘బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయి. త్వరలోనే రాష్ట్రంలోని 22 మంది ముఖ్య నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార’ని అన్నారు. దీంతో అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని తెలిపారు.అయితే పార్టీలో చేరే ఆ 22 మంది నేతల పేర్లు బయటకు రాకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

కర్నాటక ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో సొంత పార్టీలో ఎదురైన పరిణామాల వల్ల.. బీజేపీ పనైపోయింది. ఎన్నికల్లో పోటీ ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్ లోనే అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఈటల పేల్చిన ఈ బాంబుతో.. మళ్లీ బీజేపీ పోటీలోకి వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేసి మాట్లాడటంతో బీజేపీలో చేరే నేతలంతా.. కారు దిగి కాషాయ కండువా కప్పుకునేవాళ్లే అని అర్థం అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో బీఆర్ఎస్ ప్రకటించే ఎమ్మెల్యేల జాబితా తర్వాత.. బీజేపీలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

Etala Rajender said that 22 key leaders will join the BJP

Etala Rajender, 22 leaders join BJP,bjp,brs,congress,ts politics,assembly elections,CM KCR,Intelligence Survey,TS BJP,బీజేపీలో చేరికలు

Updated : 17 Aug 2023 10:28 PM IST
Tags:    
Next Story
Share it
Top