Home > తెలంగాణ > ఛలో బాటసింగారం.. ఈటల, డీకే అరుణ హౌస్ అరెస్ట్..

ఛలో బాటసింగారం.. ఈటల, డీకే అరుణ హౌస్ అరెస్ట్..

ఛలో బాటసింగారం.. ఈటల, డీకే అరుణ హౌస్ అరెస్ట్..
X

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన ‘ఛలో బాట సింగారం’ ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్, డీకే అరుణలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఛలో బాట సింగారం కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వెళ్ళాలని బీజేపీ ప్లాన్ చేసింది. కానీ పోలీసులు దానిని ఎక్కడికక్క భగ్నం చేస్తున్నారు.

తెలంగాణ సర్కార్ 6 లక్షల 10 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని కేంద్రానికి నివేదిక ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం 2 లక్షల 83 వేల డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం 17 వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో మంజూరు చేసిందని చెప్పారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం ఇళ్లను ఎందుకు చేపట్టలేదని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నిధుల నుండి ఒక్కో బెడ్ రూంకి 6 లక్షలు ఖర్చు చేసిన 2 లక్షల 83 వేల ఇళ్లు ఇప్పటికే పూర్తి అయ్యేవని బీజేపీ ప్రశ్నిస్తోంది.

కాగా ఈనెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం ధర్నాలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 25న ఇందిరా పార్క్ దగ్గర కూడా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో 9 వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. గడిచిన 9 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ది దారులకు ఇచ్చింది 28 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రమేనని ఆరోపిస్తోంది.

Updated : 20 July 2023 9:54 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top