Telangana Assembly Election 2023: సస్పెన్స్ వీడింది.. ఈటల పోటీ చేసే రెండో స్థానం అదే?
X
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ తో పాటు మరోచోట కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. హుజురాబాద్ లో జరిగిన ముదిరాజ్ మహాసభలో మాట్లాడిన ఆయన.. ‘ఇక్కడా, అక్కడా పోటీ చేస్తా’నంటూ వ్యాఖ్యానించారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం క్లారిటీ రాలేదు. కేసీఆర్ ఈసారి కామారెడ్డి, గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే గతంలో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీకి దిగుతానని సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈటల పోటీ చేయబోయే రెండో స్థారం గజ్వేలా? కామారెడ్డినా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ప్రజలు కథానాయకులు కావాలని, ఓటే వేసే ప్రజలే గెలవాలని పిలుపునిచ్చారు. పదవి తల్లిదండ్రులు ఇస్తే వచ్చేది కాదు. కొనుక్కుంటే దొరికే సరుకు కాదు. ప్రజల ఆత్మను ఆవిష్కరించి.. పెట్టే ఆశీర్వాదం అని చెప్పుకొచ్చారు. మూడు నాలుగు రోజుల్లో బీజేపీ జాబితా విడుదల చేసే అవకాశం ఉండగా.. ఈటల పోటీ చేసే ఆ రెండో స్థానంపై క్లారిటీ రానుంది.