రాజాసింగ్తో ఈటల భేటీ.. సస్పెన్షన్పై చర్చ
X
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ ఆయనపై సస్పెన్షన్ విధించి ఏడాది గడుస్తున్నా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయనకు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన హరీష్ రావుతో భేటీ అయ్యారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే భేటీ అయినట్లు రాజాసింగ్ అప్పుడే స్పష్టం చేశారు.
తాజాగా రాజాసింగ్తో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. సస్పెన్షన్ వేటుపై చర్చించినట్లు తెలుస్తోంది. రాజాసింగ్‌పై విధించిన సస్పెన్షన్ తొలగించాల్సిందిగా గతంలో ఢిల్లీ అధిష్టానానికి బండి సంజయ్ పలుమార్లు లేఖలు రాశారు. అయినా ఇప్పటివరకు రాజాసింగ్‌పై సస్పెన్షన్ తొలగించడంపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
హరీష్ రావును రాజాసింగ్ కలిసిన నేపథ్యంలో ఇప్పుడు ఈటల రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కిషన్ రెడ్డి ఈ నెల 21న రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. అయితే కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య అంతర్గత విబేధాలు ఉన్నాయనే టాక్ బీజేపీ వర్గాల్లో ఉంది. దీంతో రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను తొలగిస్తారా? లేదా? అన్న అంశంపై కన్‌ప్యూజన్ నెలకొంది.