Etela Rajender : కాంగ్రెస్ నేతలతో ఈటెల రాజేందర్ భేటి..అందు కోసమేనా?
X
బీజేపీ నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మైనంపల్లి హనుమంతరావు, మహేందర్‌రెడ్డిలతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం మర్యాదపూర్వకంగా జరిగిందా లేక ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. దీంతో ఈటల రాజేందర్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కరీంనగర్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది.
తాజాగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. దీంతో, ఈటల రాజేందర్ కూడా హస్తం గూటికి వెళ్తున్నారనే చర్చ మొదలైంది. అయితే, బీఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్ బయటకు వచ్చిన అనంతరం, ఆయన కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ నడిచింది. కానీ, అనూహ్యంగా ఈటల.. బీజేపీలో చేరారు. ఈ క్రమంలో హుజురాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి ఈటల గెలుపొందారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో(హుజురాబాద్, గజ్వేల్) పోటీచేసి ఓడిపోయారు. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈటల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారుతారా? లేక ఎన్నికల బరిలో నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.