చంద్రబాబుపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు
X
చంద్రబాబును నాయుడుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్ నే పైకి లేపే పనిలో ఉన్నారని చెప్పారు. 2018లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన బాబు.. ఈ సారి తెరవెనక ప్రయత్నాలు సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. అయినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒకటేనని.. తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈటల అన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు. కాంగ్రెస్ గత చరిత్ర అందరికీ తెలిసిందేనని చెప్పారు. బీఆర్ఎస్ మోసాలను ప్రజలు మర్చిపోరని.. నిరుద్యోగ యువత, రైతులు, మహిళలు బీజేపీని గెలపించాలనే పట్టుదలతో ఉన్నారన్నారు. కాగా తెలంగాణలో టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇప్పటికే రాజీనామా సైతం చేశారు