Home > తెలంగాణ > కోర్టు తీర్పు ఇచ్చినా.. డీకే అరుణపై వేటు తప్పదా?

కోర్టు తీర్పు ఇచ్చినా.. డీకే అరుణపై వేటు తప్పదా?

కోర్టు తీర్పు ఇచ్చినా.. డీకే అరుణపై వేటు తప్పదా?
X

తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన కేసులో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి (Krishna Mohan Reddy) ఎన్నికను తెలంగాణ హైకోర్టు (TS HihgCourt) రద్దు చేసిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో ఉన్న డీకే అరుణను హైకోర్టు ఎమ్మెల్యేగా గుర్తించింది. 2018 ఎన్నికల ఫలితాల అనంతరం.. కృష్ణమోహన్‌రెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ డీకే అరుణ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత దీనిపై హైకోర్టు తీర్పు వెలువరించింది. కృష్ణ మోహన్‌ ఎన్నికల చెల్లదని ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసినందుకు కృష్ణమోహన్‌రెడ్డికి రూ.2.50 లక్షల జరిమానా విధిస్తూ.. పిటిషనర్‌ ఖర్చుల కింద డీకే అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. 2018 డిసెంబరు నుంచి డీకే అరుణ ఎమ్మెల్యేగా కొనసాగుతారని స్పష్టం చేసింది.

ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న డీకే అరుణ.. ఈ తీర్పు సంతోషాన్ని కలిగించిందన్నారు. తీర్పు వెలువడ్డాక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వాస్తవాలను దాచారు. హైకోర్టు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, తుది తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈ తీర్పు ఆలస్యమైంది. రెండుమూడేళ్ల ముందే తీర్పు రావాల్సింది. ఆలస్యమైనా న్యాయం జరిగింది’’ అని ఆన్నారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కృష్ణ మోహన్‌రెడ్డిపై అనర్హత వేటు వేసిన న్యాయస్థానం.. 2018 డిసెంబరు నుంచి డీకే అరుణనే ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పింది. కాని వాస్తవ పరిస్థితి చూడబోతే అందుకు ఆమె అనర్హురాలేనని ఓ వర్గం అంటోంది. హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది. హైకోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించిన తర్వాత డీకే అరుణ ను బిజెపిలో ఉన్నట్టా కాంగ్రెస్ లో ఉన్నట్టా? పార్టీ మారినందుకు ఆమె పై అనర్హతవేటు పడుతుందా? ఈ సందేహాలు మొదలయ్యాయి.





2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం ఒక గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తిస్తుంది. దీని ప్రకారం.. రాజకీయ పార్టీ గుర్తింపుతో సంబంధం లేకుండా అనర్హత వేటు వర్తిస్తుంది. ఈ నిబంధన ప్రకారం చూసుకుంటే.. కాస్త టైమ్ పట్టోచ్చు కానీ ఆమెపై కూడా అనర్హత వేటు వేసే అవకాశముంది. అయితే మరో రెండు మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో ఇక ఆ ఛాన్సే లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.




Updated : 25 Aug 2023 8:19 AM IST
Tags:    
Next Story
Share it
Top