Home > తెలంగాణ > ఒక్క ఓటు ఎంత పనిచేసిందంటే..? ప్రజాస్వామ్యాన్ని..

ఒక్క ఓటు ఎంత పనిచేసిందంటే..? ప్రజాస్వామ్యాన్ని..

ఒక్క ఓటు ఎంత పనిచేసిందంటే..? ప్రజాస్వామ్యాన్ని..
X

మన ఒక్క ఓటు వేయకపోతే ఏంకాదులే అనే నిర్లక్ష్యం వద్దు. ఒక్క ఓటు తేడాతో ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి. ఆ ఒక్క ఓటు ఎన్నో తలరాతలను మార్చింది. చరిత్ర గతిని మలుపుతిప్పింది. ఒక్క ఓటుకు అంత విలువ ఉంటుంది. ఓటమిని సైతం గెలుపుగా.. గెలుపును సైతం ఓటమిగా మార్చేది ఆ ఒక్కటే. అందుకే దేనిని తేలికగా తీసుకోవద్దు. అసలు చరిత్రలో ఆ ఒక్క ఓటుతో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్క ఓటు వాజ్పేయి ప్రభుత్వాన్ని గద్దెదించింది. 1999లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్.. ఒక్క ఓటు తేడాతో కూలిపోయింది. 2008 ఎన్నికల్లో రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు సీపీ జోషీ కాంగ్రెస్‌ను అన్నీ తానై నడిపించాడు. గెలిస్తే ఆయనే సీఎం అవుతారని అంతా భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాదో ఓడిపోయారు. ఆ ఒక్క ఓటే ఆయన భవితవ్యాన్ని తారుమారు చేసింది. ఒకవేళ ఆయనకు ఒక్క ఓటు పడి ఉంటే సీఎం అయ్యేవారు. కానీ ఆయన స్థానంలో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. 2004లోకర్ణాటకలోని సంతెమరహళ్లి నియోజకవర్గం నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఎ.ఆర్‌.కృష్ణమూర్తి ఒక్క ఓటుతో ఎమ్మెల్యే సీటును కోల్పోయారు.

ఒక్క ఓటుతో మన దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎన్నో సంచలనాలు జరిగాయి. 1776లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్‌కు బదులుగా ఇంగ్లీష్‌ అధికార భాషగా మారింది.1800లో థామస్‌ జెఫర్సన్‌, 1824లో జాన్‌ క్వీన్స్‌ ఆడమ్స్‌, 1876లో రూథర్‌ఫర్డ్‌ హెమ్స్‌లు ఒకే ఒక్క ఓటు తేడాతో గెలిచి అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠించారు. ఇక 1714లో ఒక్క ఓటు తేడాతో కింగ్‌జార్జ్‌-1 ఇంగ్లండ్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇక 1923లో జర్మనీలో ఒకే ఒక్క ఓటు తేడాతో హిట్లర్‌ గెలిచారు. లేకపోతే ప్రపంచ చరిత్రే వేరేలా ఉండేదేమో.


Updated : 29 Nov 2023 9:27 PM IST
Tags:    
Next Story
Share it
Top