మరో రెండో రోజుల్లో మహజాతర...లక్నవరం సందర్శన నిలిపివేత
X
ఆసియాలోనే అతిపెద్ద జనజాతరకు మేడారం ముస్తాబవుతోంది. మరో రెండు రోజుల్లో మహాజాతర సమీపిస్తుడడంతో..అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు బారులు తీరారు. ముందుగా జంపన్న వాగులో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటున్నారు. బంగారాన్ని తలపై పెట్టుకొని వనదేవతలకు ప్రసాదాన్ని సమర్పించుకొని దర్శించకుంటున్నారు. గద్దెలపై ఉన్న సమ్మక్క, సారలమ్మను కండ్ల నిండా నింపుకొని పునీతులవుతున్నారు. అంతేగాక వనదేవతలకు కోడె మొక్కులు, బంగారం చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుడడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
లక్నవరం బంద్..
జాతర నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇవాళ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మేడారం జాతర సందర్భంగా ఇవాల్టి నుంచి లక్నవరం సందర్శనను నిలివేశారు అధికారులు. ఈ నెల 19 నుంచి 26 వరకు లక్నవరంలో పర్యాటకులకు అనుమతి లేదని తెలిపారు. మేడారం మహాజాతర భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు పోలీసులు. పర్యాటకులు సహకరించాల్సిందిగా పోలీసులు కోరారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.