Home > తెలంగాణ > Medaram Jatara : మేడారం జాతరకు సర్వం సిద్ధం.. 6వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు

Medaram Jatara : మేడారం జాతరకు సర్వం సిద్ధం.. 6వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు

Medaram Jatara : మేడారం జాతరకు సర్వం సిద్ధం.. 6వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు
X

మేడారం జాతరకు సర్వం సిద్ధమయ్యింది. ఆదివాసీల ఇలవేల్లు అయిన సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర సమీపిస్తుండటంతో ముందుగానే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ములుగు జిల్లాలోని మేడారం కోలాహలంగా మారింది. వరుస సెలవులు కావడం వల్ల వనదేవతల దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనాలతో జాతీయ రహదారి నిండిపోయింది. ఈ తరుణంలో పోలీసు అధికారులు తాడ్వాయి మీదుగా మేడారానికి వాహనాలను మళ్లించారు. ఇకపోతే ఫిబ్రవరి 21వ తేది నుంచి 24వ తేది వరకూ మేడారం జాతర జరగనుంది. మేడారం జాతరకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు లక్షలాది మంది తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అధికారులు వసతులను కల్పిస్తున్నారు.

జాతర సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కూడా 6 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. జాతరకు ముందుగానే భక్తులు తరలి వస్తున్న క్రమంలో ఫిబ్రవరి 18వ తేేది నుంచి 25వ తేది వరకూ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. అలాగే మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద ఉచిత ప్రయాణం ఉంటుందని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఒకవేళ భక్తుల రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులను కేటాయిస్తామని సజ్జనార్ తెలిపారు.


Updated : 29 Jan 2024 8:56 AM IST
Tags:    
Next Story
Share it
Top