Home > తెలంగాణ > పర్మిషన్ లేకుండా ఫర్నీచర్ తీసుకెళ్లిన శ్రీనివాస్ గౌడ్.. పీఎస్లో ఫిర్యాదు

పర్మిషన్ లేకుండా ఫర్నీచర్ తీసుకెళ్లిన శ్రీనివాస్ గౌడ్.. పీఎస్లో ఫిర్యాదు

పర్మిషన్ లేకుండా ఫర్నీచర్ తీసుకెళ్లిన శ్రీనివాస్ గౌడ్.. పీఎస్లో ఫిర్యాదు
X

బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. గురువారం కాంగ్రెస్ సర్కారు కొలువు దీరనుంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు చేస్తున్న పనులు ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారు నియోజకవర్గాల్లోని క్యాంపు ఆఫీసుల్లోని ఏసీలు, ఫర్నిచర్ ను సైలెంట్గా తరలించుకుపోవడం వివాదాస్పదంగా మారింది.

తాజా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. పేషీ నుంచి ఫర్నీచర్ తరలించడం హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్​ రవీంద్ర భారతిలోని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆఫీసులోని కంప్యూటర్లు, ఫర్నిచర్‌, పలు దస్త్రాలను ఓ వాహనంలో తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఓయూ విద్యార్థులు అక్కడకు చేరుకుని సామాగ్రి తరలింపును అడ్డుకున్నారు. అప్పటికే ఓ లోడ్ టీజీవో ఆఫీసుకు వెళ్లపోయిందని స్థానికులు చెప్పడంతో ఉక్కడ ఉద్రిక్తత నెలకొంది. పర్మిషన్ లేకుండా ఫర్నిచర్ తరలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం మారడంతో క్యాంపు ఆఫీసులు, మంత్రుల పేషీల్లో సొంత ఆస్తులు, పుస్తకాలు, కంప్యూటర్లు ఏమైనా ఉంటే కొత్త సర్కారు అనుమతి పొందిన తర్వాతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు బేఖాతరు చేస్తూ శ్రీనివాస్ గౌడ్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. తాజా మాజీల తీరుపై సీఎస్ శాంతి కుమారి స్పందించారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు, మంత్రుల పేషీల్లో సామగ్రి అంతా ప్రభుత్వానిదేనని, ఒక వేళ సొంత వస్తువులేమైనా ఉంటే అనుమతి లేకుండా తీసుకెళ్లవద్దని స్పష్టం చేశారు. ఒక వేళ తీసుకెళ్లినా రికవర్ చేస్తామని తేల్చి చెప్పారు.

Updated : 6 Dec 2023 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top