Home > తెలంగాణ > కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : గువ్వల

కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : గువ్వల

కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : గువ్వల
X

కాంగ్రెస్ హత్య రాజకీయాలకు తెరదీసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే మంత్రి జూపల్లి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ దాహం ఒక్క హత్యతో తీరేలా లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జూపల్లి హత్యా రాజకీయాలను నియంత్రించాలని మాత్రమే కేటీఆర్ చెప్పారని.. అంతకుమించి ఎటువంటి ఆరోపణలు చేయలేదన్నారు.

జూపల్లి మాత్రం కేటీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని గువ్వల మండిపడ్డారు. కాగా డిసెంబర్లో మాజీ జవాన్ మల్లేష్ హత్య కలకలం రేపుతోంది. ఇటీవల ఆ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడొద్దని సూచించారు. దీనిపై మంత్రి జూపల్లి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలతోనే మల్లేష్ హత్య జరిగిందని.. దానిని రాజకీయం చేయడం తగదని జూపల్లి అన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు.

Updated : 16 Jan 2024 4:56 PM IST
Tags:    
Next Story
Share it
Top