Parliament Elections : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
X
బీజేపీ కీలక నేత జితేందర్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ ప్రజలు తనను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. 2004, 2019 ఎన్నికల్లో తనకు సీట్ రాలేదని.. లేకపోతే ఆ ఎన్నికల్లోనూ గెలిచేవాడినని తెలిపారు. అంతేగానీ, ప్రజలు తనను ఎప్పుడూ తిరస్కరించలేదని చెప్పారు. అయితే ఈ సారి పోటీలో ఉంటానన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎఫైర్స్ కమిటీ అంగీకరిస్తే తప్పకుండా పోటీలో ఉంటానని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తగా అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు.
ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని.. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంతో కేసీఆర్ కోట్ల కమీషన్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. ఫ్రీ బస్సు సౌకర్యంతో మహిళల మధ్య గొడవలు జరుగుతున్నాయని అన్నారు