Home > తెలంగాణ > Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
X

తెలంగాణలో మేడారం జాతర(Medaram Jatara) సందడి మొదలైంది. జాతరకు మరికొద్ది రోజులండగానే.. సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు భక్తులు మేడారానికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం భక్తులకు రాష్ట్ర అటవీశాఖ(Telangana Forest Department) శుభవార్త చెప్పింది. మేడారం జాతర ముగిసేవరకు పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన మేరకు సంబంధిత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ రుసుము చెల్లింపు నిలిపివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

రేపటి (ఫిబ్రవరి 2) నుంచి 29వ తేదీ వరకు పర్యావరణ రుసుము(Environment Impact Fee) వసూలును నిలిపివేయనున్నట్లు అటవీశాఖ తెలిపింది. ఈ మేరకు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నుంచి ఉత్తర్వులు అందాయి. ప్రభుత్వ నిర్ణయంతో మేడారం జాతరకు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అవుతుంది. ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తోంది. ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్టిక్‌ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు వినియోగిస్తోంది. అయితే మేడారం జాతర నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి విజ్జప్తి మేరకు జాతర ముగిసే వరకు ఈ ఫీజు వసూలును నిలిపివేయనున్నారు.

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క-సారలమ్మల(Sammakka-Saralamma) జాతర.. కేవలం తెలంగాణలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో గల మేడారం అనే చిన్న గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. వరంగల్ నుంచి సుమారు 104 కిమీ, హైదరాబాద్ నుంచి సుమారు 238 కిలో దూరంలో ఈ జాతర నిర్వహిస్తారు. రెండేండ్లకు ఒకసారి మాఘమాసంలో 4 రోజుల పాటు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుండి కూడా సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎక్కడెక్కడి నుంచో వీవీఐపిలు కూడా ఈ జాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధిక మంది హాజరయ్యే జాతర ఇదే.

Updated : 1 Feb 2024 5:11 PM IST
Tags:    
Next Story
Share it
Top