Home > తెలంగాణ > ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు

ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు

ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పెంపు
X

వాహనదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగుస్తు నేఫథ్యంలో ఫిబ్రవరి 15 వరుకు పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరుకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. వాహనదారుల నుంచి ఫిర్యాదు వస్తున్న క్రమంలో.. గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో డిసెంబర్ నాటికి 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అయితే ఇవాళ్టి వరకూ వాహనదారులు 1.05 కోట్ల చలానాలు చెల్లించగా, వాటి నుంచి రూ.107 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.చలాన్ల రాయితీకి వాహనదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలాన్లు ఉండగా…. ఇప్పటి వరకు 1.05 కోట్లకు పైగా చలాన్లు క్లియర్ చేసుకున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నేటి వరకు రూ.107 ​కోట్లు వసూలైనట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated : 31 Jan 2024 11:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top