Home > తెలంగాణ > రాష్ట్రంలో పెరుగుతున్న కండ్ల కలక బాధితులు.. హాస్పిటల్స్‌కు క్యూ

రాష్ట్రంలో పెరుగుతున్న కండ్ల కలక బాధితులు.. హాస్పిటల్స్‌కు క్యూ

రాష్ట్రంలో పెరుగుతున్న కండ్ల కలక బాధితులు.. హాస్పిటల్స్‌కు క్యూ
X

వర్షాకాలం అంటేనే వ్యాధుల సీజన్‌. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి అంటువ్యాధుల బారిన పడుతుంటారు చాలా మంది. ప్రస్తుతం జనాలందరినీ కలవరపెడుతున్న వ్యాధి కండ్ల కలక. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది. పెద్దా చిన్నా తేడా లేకుండా అందరూ కళ్ళ కలకల భారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో నేత్ర విభాగాలకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఐడ్రాప్స్‌ సులువుగా తగ్గిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. మెడికల్‌ షాపుల్లో కళ్ళ కలక మందులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,000 కేసులు నమోదైనట్టు కంటి ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా, ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండ్ల కలక బారిన పడతాయి.

మినిమిమ్ ఒక వారమ్

కండ్లకలక వస్తే కళ్ళు ఎర్రబారి కళ్ళలో నుంచి నీళ్లు కారుతాయి. కంటి రెప్పలు బాగా వాసి పోతాయి. అంతేకాదు రాత్రి పడుకుని తెల్లవారి నిద్ర లేచేసరికి కళ్ళు అతుక్కు పోతాయి. కళ్ళు ఎర్రబారడం, కళ్ళు దురదగా ఉండటం, కళ్ళ రెప్పల్లో వాపు, కళ్ళ నుండి నీరు కారణం, కళ్ళనుండి ఫ్లూయిడ్ డిశ్చార్జ్ కావడం కండ్లకలక లక్షణాలు. మందులు వాడకపోయినప్పటికీ వారం రోజుల్లో తగ్గే అవకాశం ఉందని, కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటీ బయోటిక్‌ డ్రాప్స్‌ వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

కంటిని తరుచు నీటితో కడుక్కోవాలి. కండ్ల కలక వచ్చిన వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు వాడిన వస్తువులు వాడరాదు. ఈ వ్యాధి వచ్చిన వారి టవల్స్‌, కర్చీఫ్‌లు ఇతరులు వాడకూడదు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు. కండ్ల కలక వచ్చిన వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మంచి విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకు కూరలు, క్యారెట్లు, సిట్రన్‌ ఫ్రూట్స్‌ ఇతర పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్రాంతాల్లో తిరగకుండా ఉంటే ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉండదు.

ఇది ప్రమాదం

సాధారణంగా కళ్ళ కలక వస్తే వారంలో తగ్గిపోతుంది. వైరస్‌తో కళ్ళ కలక వస్తే మూడు వారాలపాటు ఉంటుంది. నవజాత శిశువులు, నెలలోపు వయసు ఉన్న వారిలో వస్తే మాత్రం ప్రమాదంగా మారుతోంది. తెల్లనిపొర నుంచి కంటిగుడ్డు కార్నియాకు విస్తరిస్తే చూపు మందగిస్తోంది. కార్నియాకు ఇన్‌ఫెక్షన్‌ సోకి అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. రంధ్రాలు పడే అవకాశం కూడా ఉంటుందని ఇలాంటి పరిస్థితి వస్తే చూపుకోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కళ్ళ కలక వారంలో తగ్గనట్లైతే నేత్ర వైద్య నిపుణుల్ని సంప్రదించి వారి సూచనల మేరకు మందులు వాడటం మంచిది.

Updated : 31 July 2023 8:07 AM IST
Tags:    
Next Story
Share it
Top