Home > తెలంగాణ > Fake Notes In Medaram : మొదలైన మేడారం హుండీల లెక్కింపు.. కట్ చేస్తే..!

Fake Notes In Medaram : మొదలైన మేడారం హుండీల లెక్కింపు.. కట్ చేస్తే..!

Fake Notes In Medaram : మొదలైన మేడారం హుండీల లెక్కింపు.. కట్ చేస్తే..!
X

తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర.. అంగరంగ వైభవంగా ముగిసింది. దాదాపు కోటిన్నర మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జాతర సమయంలో భక్తులు అమ్మవార్లకు సమర్పించిన కానుకలను (హుండీలను) గురువారం (ఫిబ్రవరి 29) నుంచి లెక్కిస్తున్నారు. మహాజాతర నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ జాతరలో మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేశారు. వాటిని హనుమకొండలో ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి తీసుకొచ్చి లెక్కిస్తున్నారు. లెక్కింపు జరిగే ప్రదేశంలో చుట్టూరా సీసీ కెమెరాలతో పాటు, 24 గంటలూ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు. లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే హుండీల్లో నకీలో కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. ఈ నోట్లపై గాంధీ బొమ్మ బదులు అంబేడ్కర్ బొమ్మ ఉంది. గురువారం మధ్యాహ్నం హుండీలు లెక్కిస్తుండగా.. అంబేడ్కర్ ఫొటో ఉన్న నకిలీ రూ.100 నోటు కనిపించింది. దీంతో అవాక్కైన అక్కడి సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వాటిని తీసి పక్కన పడేసి తిరిగి లెక్కింపును ప్రారంభించారు.

Updated : 29 Feb 2024 3:10 PM IST
Tags:    
Next Story
Share it
Top