Home > తెలంగాణ > Falaknuma Train Accident : ఫలక్‌నుమా రైలు ప్రమాదం..పలు రైళ్లు రద్దు

Falaknuma Train Accident : ఫలక్‌నుమా రైలు ప్రమాదం..పలు రైళ్లు రద్దు

Falaknuma Train Accident : ఫలక్‌నుమా రైలు ప్రమాదం..పలు రైళ్లు రద్దు
X

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లు రద్దవగా మరికొన్ని రైళ్లు దారి మళ్లాయి. అగ్ని ప్రమాదం జరిగిన కారణంగా రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రమాదం జరిగిన చోట ట్రాక్ క్లియరెన్స్ కోసం 3 నుంచి 4 గంటల సమయం పట్టే ఛాన్స్ ఉంది. అందుకే సికింద్రాబాద్ - మన్మాడ్, సికింద్రాబాద్-రేపల్లె రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు . జన్మభూమి, నర్సాపుర్ రైళ్లు విజయవాడ మీదుగా మళ్లించారు. వీటితో పాటు మరో రెండు రైళ్లను మళ్లించినట్లు సమాచారం. రద్దైన రైళ్లలోని ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలక్‌నుమా రైలులో పెను ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో ఈ ఘటన జరిగింది. రైలు సికింద్రాబాద్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 బోగీలకు మంటలు అంటుకోగా.. 4 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంపై విచారణకు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్‌ ఆదేశించారు. ప్రయాణికులను సికింద్రాబాద్‌ తరలిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పాల్గొంటున్నట్లు తెలిపారు.

అయితే ఇదిలా ఉంటే ఇప్పడు మరో వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. ముందుగా ట్రైన్ లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లనే రైలులో మంటలు అలుముకున్నాయని అందరూ భావించారు. కానీ ఇంతటి విధ్వంసానికి కారణం ఓ సిగిరెట్ అని టాక్ వినిపిస్తోంది. రైలులో ప్రయాణించే ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా ఎస్ 4 బోగీలో ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగిరెట్ తాగడంతోనే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగిందని వినిపిస్తోంది.




Updated : 7 July 2023 3:44 PM IST
Tags:    
Next Story
Share it
Top