Home > తెలంగాణ > ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. మంటల్లో కాలిపోయిన బోగీలు

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. మంటల్లో కాలిపోయిన బోగీలు

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. మంటల్లో కాలిపోయిన బోగీలు
X

ఫలక్‌నుమా రైలు (Train No - 12703)లో పెను ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అలముకున్నాయి. అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. దీంతోప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో ఈ ఘటన జరిగింది. రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల ఆదేశాలతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగిన క్షణాల్లోనే దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో 4 బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి. మిగతా బోగీలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. సంఘటన స్థలికి చేరుకున్న సిబ్బంది రెండు బోగీల మధ్య లింక్‌ను వేరు చేశారు.





ఇప్పటి వరకు 6 బోగీలకు మంటలు అంటుకోగా.. 4 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక యంత్రాలు అక్కడి చేరుకునేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఇప్పటివరకు మంటలు ఆర్పే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. స్థానిక పోలీసులు, ఆర్డీవో అక్కడి చేరుకున్నారు. మరోవైపు దీనిపై సమాచారం అందుకున్న రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ సంఘటన స్థలికి బయల్దేరారు. సంఘటన స్థలం నుంచి ఆర్డీవో భూపాల్‌రెడ్డి రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులతో సంప్రందింపులు జరుపుతున్నారు. బోగీల లింక్‌ను తప్పించం వల్ల మిగతా బోగీలకు మంటలు అంటుకునే అవకాశం లేదని ఆయన అన్నారు.





ఈ రైలులో సుమారు 1500 మంది ప్రయాణీకులున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ప్రమాదంపై రైల్వేశాఖాధికారులు విచారణ చేస్తున్నారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు 80 నుండి వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరికి సమీపంలో రైలు స్పీడ్ తగ్గిన సమయంలో ఈ మంటలను గుర్తించారు. ఈ రైలులోని ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 రైలు బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం.




Updated : 7 July 2023 12:36 PM IST
Tags:    
Next Story
Share it
Top