Home > తెలంగాణ > రైతులకు శుభవార్త.. అకౌంట్లలో రైతు బంధు పైసలు జమ

రైతులకు శుభవార్త.. అకౌంట్లలో రైతు బంధు పైసలు జమ

రైతులకు శుభవార్త.. అకౌంట్లలో రైతు బంధు పైసలు జమ
X

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బంధు డబ్బులు సర్కారు విడుదల చేసింది.ఇవాళ మధ్యాహ్నం నుంచే అన్నదాత నుంచే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పడుతున్నాయి. దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రెండు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే పైసలు పడుతున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాత పథకం ప్రకారమే డబ్బులు అందినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న స్పష్టం చేశారు. మరోవైపు రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా రైతు ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని ఆయన మంత్రి వెల్లడించారు. తెలంగాణలో నూతంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామంది. అలాగే రైతు కూలీలకు ఏటా ఎకరానికి రూ.12వేల చొప్పున ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది.రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు రూపొందించకపోవడంతో రైతులకు పంట పెట్టుబడి చెల్లింపు ఆలస్యం అవుతోంది.

మరోవైపు.. రాష్ట్రంలోని పలు చోట్ల రైతులు యాసంగి పంట కోసం పొలం పనులు ప్రారంభించటంతో.. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పెట్టుబడి సాయం వేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతులకు విడుదల చేయాలని నిర్ణయించారు.రైతు బంధు విడుదలపై డిసెంబర్ 9 వ తేదీ నుంచే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. డిసెంబర్ 9 తేదీనే రైతు భరోసా డబ్బులు అన్నదాతల అకౌంట్లలో వేస్తానని మాట ఇచ్చారని.. కానీ ఇప్పటికి కూడా పెట్టుబడి సాయంపై క్లారిటీ లేదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వం ఏర్పడి వారం కూడా కాకముందే విమర్శలు చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారనో.. రైతులు ఎదురు చూస్తున్నారనో కానీ.. మొత్తానికి పెట్టుబడి సాయం మీద ఓ నిర్ణయం తీసుకోవటంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Updated : 18 Jan 2024 9:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top