Home > తెలంగాణ > కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి

కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి

కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి
X

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు... అదుపు తప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటాక.. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. లీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సిరాజ్‌ అనే వ్యక్తి కూతురికి కాకినాడకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. సిరాజ్‌ గ్రామంలో ఈ వివాహన్ని సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. నిఖా అనంతరం వధూవరులు, వారి తల్లిదండ్రులు కార్లలో కాకినాడ వెళ్లిపోయారు. మంగళవారం వరుడి ఇంటి వద్ద రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు.. ఒంగోలు డిపోకి చెందిన ఆర్టీసీ ఇంద్ర బస్సును అద్దెకు తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి పొదిలి నుంచి బయల్దేరిన బస్సు కాలువ సమీపంలోకి వచ్చేసరికి అదుపుతప్పి.. సైడ్ వాల్ కు తగలడం వల్ల కంట్రోల్ అవ్వక కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్(65),అబ్దుల్ హాని(60), షేక్ రమీజ్ (48),ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా(35),షేక్ హీనా (6)గా మరణించారు. ప్రమాదం జరిగిన స్థలంలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి.

ఈ ప్రమాద ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గర్గ్ మాట్లాడుతూ.. ‘ముందు బస్సు సైడ్ వాల్‌కు కొట్టుకోవడంతో బస్సులోని ప్రయాణికులు ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఆ తరువాత బస్సు కాలువలోకి దూసుకెళ్లే క్రమంలో..బస్సుకింద క్రష్ అయి ఏడుగురు మృతి చెందారు. మాకు సమాచారం అందగానే హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టాం. దీనివల్ల చాలామందిని రక్షించగలిగాం. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేద’ని చెబుతున్నారు.




Updated : 11 July 2023 2:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top