Home > తెలంగాణ > వీడిని తండ్రి అనాలో.. ఏమనాలో మీరే చెప్పండి

వీడిని తండ్రి అనాలో.. ఏమనాలో మీరే చెప్పండి

వీడిని తండ్రి అనాలో.. ఏమనాలో మీరే చెప్పండి
X

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలయముడిలా మారాడు. ఊహ తెలియని ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లు శివారు బలరాంతండాలో జరిగింది. ఇద్దరు పిల్లలకు తండ్రి రమేష్ విషమిచ్చాడు. రెండేళ్ల బాలుడు మృతి చెందగా మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే విషమివ్వడానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

అయితే తాగిన మైకంలోనే ఇద్దరు చిన్నారులకు ఆ తండ్రి పురుగుల మందు తాగించాడని స్థానికులు అంటున్నారు. బలరాంతండాకు చెందిన పెద్దపులి రమేష్ కు ముగ్గురు పిల్లలుండగా.. వారిలో ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. రమేష్ నిత్యం మద్యం తాగుతాడ‌ని, ఇంట్లో గొడవ చేస్తుంటాడని తండావాసులు చెబుతున్నారు. అయితే.. కొద్ది రోజుల క్రితం రమేష్ వేధింపులు తట్టుకోలేక అత‌ని భార్య తల్లి గారింటికి వెళ్లింది. కాగా, గురువారం రాత్రి తాగిన మైకంలో ర‌మేశ్ త‌న ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు తాగించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి తరలించారు. కాగా, చిన్న కుమారుడు చికిత్స పొందుతూ చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు.









Updated : 4 Aug 2023 11:06 AM IST
Tags:    
Next Story
Share it
Top