Telangana assembly : కరెంట్ కోతల భయం..అసెంబ్లీలో జనరేటర్ ప్రత్యక్షం
X
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో పవర్ జనరేటర్ వాహనం ప్రత్యక్షం అయ్యింది. గత పదేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా అసెంబ్లీ వద్ద జనరేటర్ ఉండటంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా కరెంట్ విషయంలోనే అనేక వాదోపవాదాలు జరిగాయి. కరెంట్ విషయంలో కాంగ్రెస్ తన వైఖరి మార్చుకుంటుందని అందరూ అనుకున్నారు. కరెంట్ కోతలు ఉండవని కాంగ్రెస్ నాయకులు కూడా అప్పట్లో హామీలు ఇచ్చారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు ఉంటున్నాయి. దానికి నిదర్శనమే ఈ పవర్ జనరేటర్ అన్నట్లుగా ఉంది. నేడు ఇరిగేషన్‌పై అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవుతుండగా ఎక్కడ కరెంట్ పోతుందేమోనన్న భయం, అనుమానంతో జనరేటర్ వాహనాన్ని సిద్ధం చేశారు. అయితే దీనిపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.
కరెంట్ పోతుందనే భయంతో రేవంత్ సర్కార్ జనరేటర్ తెచ్చుకుందనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలకులకే కరెంట్ కోతలతో ఇబ్బందులు తప్పడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పవర్ జనరేటర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.