Home > తెలంగాణ > ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై లేటెస్ట్ టెక్నాలజీ..!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై లేటెస్ట్ టెక్నాలజీ..!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై లేటెస్ట్ టెక్నాలజీ..!
X

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 84 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరినే అర్హులుగా ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లిళ్ల తరవాత ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారికి మాత్రం ఈ నిబంధనను వర్తింపజేయరని సమాచారం. దరఖాస్తుల వడపోత అనంతరం గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏడాదికి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి.. ఎన్ని నిధులు కేటాయించాలన్న అంశాలపై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ప్రణాళికను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులను గుర్తించిన తర్వాత ఎన్ని నిధులు అవసరమన్న అంచనా వస్తుందని.. ఆమేరకు బడ్జెట్‌లో కేటాయిస్తారని ఉన్నతాధికారి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం 5లక్షలు అందిస్తామని స్థలం లేనివారికి స్థలం కేటాయించడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని కాంగెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం కేవలం ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను, రెండింటి కోసం వచ్చిన దరఖాస్తులను వేరుచేస్తున్నారు. కొంతమంది వేర్వేరు ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకున్నట్లు, ఒకే కుటుంబానికి సంబంధించి ఒకటికి మించి అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడెక్కడ దరఖాస్తు చేశారో తెలుసుకునేందుకు దరఖాస్తుదారుల ఆధార్‌ నంబర్లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతను వినియోగించి అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.

Updated : 27 Jan 2024 3:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top