Home > తెలంగాణ > డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం మాస్టర్ ప్లాన్.. మంత్రి సంతకం ఫోర్జరీ చేసి..

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం మాస్టర్ ప్లాన్.. మంత్రి సంతకం ఫోర్జరీ చేసి..

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం మాస్టర్ ప్లాన్.. మంత్రి సంతకం ఫోర్జరీ చేసి..
X

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఇద్దరు కేటుగాళ్లు పెద్ద స్కెచ్ వేశారు. ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. విషయం వెలుగులోకి రావడంతో మినిస్టర్ ఓఎస్డీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం నర్రెగూడం గ్రామానికి చెందిన ఎం.డి.గౌస్‌ పాషా, గుంటి శేఖర్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేశారు. నకిలీ లెటర్ హెడ్ తయారు చేసి వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు అలాట్ చేయాల్సిందిగా సంగారెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారు. ఈ విషయం మంత్రి ఎర్రబెల్లి దృష్టికి వచ్చింది. దీంతో సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఎర్రబెల్లి ఓఎస్డీ డాక్టర్ రాజేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు గౌస్ పాషా, గుంటి శేఖర్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated : 21 Aug 2023 1:32 PM IST
Tags:    
Next Story
Share it
Top