Home > తెలంగాణ > హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం..

హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం..

హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం..
X

హైదరాబాద్ చందానగర్ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న తపాడియాస్ మారుతి మాల్ లో ఉదయం 6గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మాల్ లోని 5వ అంతస్థులో ఉన్న జేపీ సినిమాస్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో మల్టీప్లెక్స్ లోని 5 స్క్రీన్లు అగ్నికి ఆహుతయ్యాయి. హాల్ లోని ఫర్నీచర్ అంతా కాలి బూడిదైంది. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు వేరే అంతస్తులోకి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు.

ఉదయం 6 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో మల్టీప్లెక్స్ లో జనం ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీగా ఆస్తి నష్టం మాత్రం జరిగింది. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణముందా అనేది తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన తపాడియా మాల్ను ఇటీవలే ప్రారంభించారు.

Updated : 12 Aug 2023 9:44 AM IST
Tags:    
Next Story
Share it
Top