Home > తెలంగాణ > వేములవాడ రాజన్న ఆలయం జాతర గ్రౌండ్‎లో అగ్ని ప్రమాదం

వేములవాడ రాజన్న ఆలయం జాతర గ్రౌండ్‎లో అగ్ని ప్రమాదం

వేములవాడ రాజన్న ఆలయం జాతర గ్రౌండ్‎లో అగ్ని ప్రమాదం
X

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధి సమీపంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. జాతర గ్రౌండ్‏లో ఉన్న దేవాలయానికి చెందిన రెండు లీజు గదుల్లో ఉన్న కొబ్బరి చిప్పలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఎండిన కొబ్బరి చిప్పలు కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు, ఆస్తినష్టం మాత్రం జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలేమిటో ఇంకా తెలియలేదు. పోలీసులు మాత్రం ఘటనపై కేసు నమోదు చేశారు. జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

అగ్ని ప్రమాదంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి, ఒక్కసారిగా పొగ వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. రాజన్న దేవాలయంలో వేలం ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్‌కి సంబంధించిన కొబ్బరి చిప్పలు కావడంతో నష్టం కూడా ఆ కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు తరచుగా రాజన్న సన్నిధిలో జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు.

Updated : 9 Sept 2023 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top