Home > తెలంగాణ > హైదరాబాద్ హబ్సిగూడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ హబ్సిగూడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ హబ్సిగూడలో అగ్నిప్రమాదం
X

హైదరాబాద్ లోని హబ్సిగూడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అన్ లిమిటెడ్ షోరూమ్ కు మంటలు అంటుకున్నాయి. పది ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు ఫోర్లు పూర్తిగా కాలిపోయాయి.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ షాపుకు దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉంది. దానికి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా పెట్రోల్ బంకును పోలీసులు మూసేయించారు.

మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు, దానికి తోడు విపరీతమైన పొగ అలుముకుంది. పొగ మరింత వ్యాపించకుండా దుకాణం అద్దాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఉప్పల్-హబ్సిగూడ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.



Updated : 2 Aug 2023 12:43 PM IST
Tags:    
Next Story
Share it
Top